సరస్వతి పుత్రునికి లక్ష్మి కటాక్షం కరువు | మహబూబాబాద్ జిల్లాలో సాయం కోసం ఎదురుచూపు

Date: 2024-12-12
news-banner
అందరి టీవీ డిజిటల్ / డెస్క్ ప్రత్యేకం 
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గాలివారిగుడెం రాము తండాకి చెందిన  బానోత్ సందీప్  తండ్రి బానోత్ బాలాజీ  రెక్కాడితేకానీ డొక్కాడని నిరుపేద గిరిజన కుటుంబ నుండి కష్ట పడి 
2022 సంవత్సరం లో NEET MEDICAL లో ర్యాంక్ సాధించి ఎ కేటగిరీ లో వరంగల్ లోని ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ లో కౌన్సిలింగ్ ద్వారా సీటు సాధించాడు.

ఇందుకు గాను  ఒక సంవత్సరానికి కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు, పుస్తకాలు , లైబ్రరీ,  పరీక్ష రుసుము, ఇతర ఖర్చులు సుమారు 2 లక్షలు, 4 సంవత్సరాలకి  మొత్తం 8 లక్షలు ఖర్చు అవుతుంది.
వారికి ఉన్న 40 గుంటల పంట పొలాన్ని గత సంవత్సరం ఫీజు మరియు పంట నష్టానికి చేసిన అప్పుల కింద అమ్మి వేయడంతో  
వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
మిగిలిన 20 గుంటల భూమి తన చెల్లెలి పెళ్లి కోసం ఉంచగా ఇపుడు సందీప్ చదువు ఖర్చులకోసం మళ్ళీ అప్పులు  చేసి ఫీజు కట్టలేక  రెండవ సంవత్సరం  వార్షిక పరీక్ష వచ్చే నెల  జనవరి లో రాయవలసి ఉండగా ఆపివేయవలసిన పరిస్థితి వచ్చిందని కుటుంబసభ్యులుతెలియచేసారు.

 దాతలు ముందుకి వచ్చి  ఆర్ధిక సహాయం చేస్తే తన వైద్య విద్య ముందుకు సాగించే దిశగా వైద్య విద్యార్థి సందీప్ దీనంగా ఎదురు చూస్తున్నాడు.
సహాయం చేసే దాతలు 
95022 58780  ఫోన్ పే / జి పే నెంబర్ లేదా 
అకౌంట్ నెంబర్ :310312010002010
IFSC Code:UBIN0831034
ద్వారా ఆర్ధిక సహాయం చేయవలసిందిగా బానోత్ సందీప్ కుటుంబం కోరుతున్నారు.

image

Leave Your Comments