మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.. దాడి జరిగిన 24 గంటల తర్వాత పోలీసులకు మనోజ్ పిర్యాదు

Date: 2024-12-09
news-banner
అందరి టీవీ డిజిటల్ / హైదరాబాద్ 
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్..
కీలక మలుపు తిరిగింది. దాడి జరిగిన 24 గంటల తర్వాత.. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో మంచు మనోజ్..
స్వయంగా హైదరాబాద్ సిటీ శివార్లలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆయన వెంట సెక్యూరిటీలో భాగంగా కొంత మంది బౌన్సర్లు కూడా ఉండటం విశేషం.
పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో.. తనపై దాడి జరిగినట్లు మంచు మనోజ్ స్వయంగా కంప్లయింట్ చేశారు. జల్ పల్లిలోని ఇంట్లోనే.. తనపై.. తన భార్యపై తండ్రి మంచు మోహన్ బాబు సమక్షంలోనే.. విద్యానికేతన్ స్కూల్స్ పర్యవేక్షిస్తున్న వినయ్ అనే వ్యక్తి దాడి చేశాడని మనోజ్ కంప్లయింట్ చేశారు. తనపై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డానని.. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నానంటూ ఆస్పత్రి రిపోర్టులు, స్కానింగ్ రిపోర్టులతో సహా మనోజ్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు. ఇంట్లో తనను రౌండ్ చేసి మరీ కొట్టారంటూ కంప్లయింట్ చేశారు. ఎలా కొట్టింది.. ఎవరెవరు కొట్టింది.. దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా పోలీసులకు వివరిస్తూ కంప్లయింట్ చేశారు మంచు మనోజ్
image

Leave Your Comments