అందరి టీవీ డిజిటల్ హైదరాబాద్:డిసెంబర్ 08
పల్నాడు జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల మండలం
బ్రాహ్మణపల్లి సమీపంలో చెట్టును ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా,
మరో నలుగురికి గాయాల య్యాయి.
దీనిపై స్థానికులు పోలీ సులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక
చర్య లు చేపట్టారు. బాధితులను చికిత్స నిమిత్తం పిడుగు రాళ్ల ఆసుపత్రికి తరలిం చారు.
మృతులు నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులు తుళ్లూరి సురేష్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లు అని తెలిపారు.
శనివారం తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. కొత్తకారుకు పూజలు చేయించేందుకు వీరంతా కొండగట్టుకు వెళ్లారని వివరించారు.
అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు పేర్కొన్నా రు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.