అప్పు కోసం స్నేహం చేశాడు ; ఇవ్వనందుకు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి హత్య

Date: 2024-12-08
news-banner
అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రతినిధి 
 5 లక్షల రూపాయలు అప్పు కోసం స్నేహం  చేశాడు.... అప్పు ఇవ్వడంలో ఆలస్యం చేసినందుకు విసుగు చెంది మద్యం సేవించి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని దారుణంగా హత్య చేశారని వరంగల్ ఎసిపి నందిరాం  నాయక్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  తెలిపారు. 
ఈనెల మూడో తేదీన రంగంపేటలో శాంట్రో కార్ లో శవం ఉందన్న సమాచారంతో దర్యాప్తు చేసిన మట్టవాడ పోలీసులు నిందితుడు జక్కుల శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. 
ములుగు జిల్లా మంగపేట మండలం కోమిటిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ హనుమకొండ రెవెన్యూ కాలనీ ప్రగతి నగర్ లో ఉంటూ ప్రధానమంత్రి యువజన స్కీం లో కోఆర్డినేటర్ గా విధులు నిర్వహించడంతోపాటు బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించడం అలవాటు చేసుకున్నాడు
 ఈ క్రమంలో రెండు నెలల క్రితం హన్మకొండ ప్రగతి నగర్ కు చెందిన వెలిగేటి రాజమోహన్ పరిచయమయ్యాడు. భార్య చనిపోయిందని ఒంటరిగా ఉన్నాను
 అంటూ రెండవ సంబంధం చూడమని మృతుడు శ్రీనివాసరావును కోరారు
 ఇదే అదురుగా భావించిన శ్రీనివాస్ రావు ఐదు లక్షల రూపాయలు అప్పు కోనగా రేపు మాపు అని సతాయించడంతో విసుకు చెంది ఈనెల 2వ తేదీ రాత్రి శ్రీనివాసరావు తను కిరాయి ఇంటికి పిలిపించుకొని ఫుల్లుగా మద్యం తాగించి రాజమోహన్ పై రోకలి బండతో దాడి చేసి హత్య చేశాడు. హత్య చేసి అతని ఒంటి మీద ఉన్న రెండు గొలుసులు, మూడు ఉంగరాలు, చేతి కి ఉన్న బ్రాస్లెట్ తీసుకొని మృతుడిని అతని కారులో పడేసి వేరే చోట బురదహాన్ని పడేదామనుకొని నగరం మొత్తం తిరిగాడు 
ఎంతకీ అణువైన చోటు దొరకకపోవడంతో ఉదయం 3:48 నిమిషాలకు రంగంపేటలో కారు వదిలి వెళ్ళిపోయాడు.
 కేసు నమోదు చేసుకున్న మట్టేవాడ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు ఎట్టకేలకు నిందితులు శ్రీనివాస్ ను ఈరోజు ఉదయం అరెస్ట్ చేసి అతని వద్ద బంగారంతో పాటు సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని వరంగల్ ఎసిపి నందిరాం నాయక్ తెలిపారు.
image

Leave Your Comments