అందరి టీవీ డిజిటల్ / సుల్తానా బజార్ / హైదరాబాద్
రాజ్ భవన్ ఏరియాలో ఉండే ముస్కాన్ దాబెల అలియాస్ అస్మా ఉన్నిసా భర్త ఏడాది కింద చనిపోయాడు.
కుటుంబ పోషణ కోసం సెక్స్ వర్కర్ గా మారింది. రంగమహల్ చౌరస్తా వద్ద రాత్రి సమయంలో విటులను ఆకర్షిస్తూ అమాయకులను గుర్తించి బెదిరింపులకు పాల్పడుతోంది. బ్లేడుతో బెదిరించి అందినకాడికి దండుకుని పారిపోతుంది. ఫలక్ నమా ఏరియాకు చెందిన గులాం మస్తాన్(25) ఇటీవల అప్జల్ గంజ్ నుంచి రంగమహల్ చౌరస్తాకు వెళ్తుండగా అస్మా ఉన్నిసా కనిపించడంతో ఆగాడు.
మాట్లాడుతూనే తన వద్ద ఉన్న బ్లెడ్ తో అతనిపై దాడిచేసింది. సెల్ ఫోన్, వెయ్యి రూపాయలు క్యాష్ లాక్కుని పారిపోయింది. దీంతో బాధితుడు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితురాలును అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. గతంలో ఇదే తరహాలో రెయిన్బోబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయినట్లు సిఐ శ్రీనివాసచారి తెలిపారు