దారుణం.. పులి దాడిలో 8 నెలల గర్భిణి మహిళ మృతి

Date: 2024-12-07
news-banner
అందరి టీవీ డిజిటల్ / జాతీయం 
మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. గడ్చిరోలిలో శారద (24) అనే 8 నెలల గర్భిణి మహిళ పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా పులి దాడి చేసింది. ఈ దాడిలో శారద అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం అటవీశాఖ అధికారులు పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు
image

Leave Your Comments