గుండెపోటుతో నర్సంపేట కాసం ఫ్యాషన్స్ వర్కర్ మృతి

Date: 2024-10-10
news-banner
అందరి టీవీ డిజిటల్ ,వరంగల్ జిల్లా ప్రతినిధి 
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో హడావుడిగా ప్రారంభించిన 
కాసం ఫ్యాషన్స్ లో పండగ పూట విషాదం 
గుండెపోటుతో మాల్ లో పనిచేస్తున్న శివకుమార్ అనే వ్యక్తి మృతి ,
ఊపిరాడక అందులో పనిచేస్తున్న శివకుమార్ అనే వ్యక్తి రాత్రి పని సమయంలో సుస్తీగా ఉందని  బయటకు వచ్చి ఆస్పత్రి వెళ్ళడానికి  బైక్ తీస్తుండగా   గుండె పోటుతో మృతి చెందినట్లు తెలిపిన కుటుంబ సభ్యులు ....
మృతుడి స్వగ్రామం  దుగ్గొండి మండలం నాచినపల్లి
మృతదేహాన్ని కాసం ఫ్యాషన్ ఎదుట పట్టి ధర్నా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం 
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది 
పూర్తి అనుమతులు లేకుండానే షాపింగ్ మాల్ ప్రారంభించిన యాజమాన్యం అంటూ పలువురు ఆరోపణలు చేసిన ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది 

పండుగ కావడం చేత భారీగా తరలివస్తున్న ప్రజలు 
ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందిస్తారా అంటు పలువురు ఆగ్రహం 
నడిరోడ్డుపై పార్కింగ్ చేయడంతో ప్రధాన రహదారిపై వచ్చిపోయే వాహనాలకు భారీగా అంతరాయం కలుగుతున్న కన్నెత్తయినా చూడని అధికారులు 
image

Leave Your Comments