యాక్షన్‌ ఘట్టాల్లో బిజీ బిజీగా విశ్వంభర

Date: 2024-06-26
news-banner

అందరి టీవీ డిజిటల్ ,సినిమా 
మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌ నేతృత్వంలో భారీ పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు

.
చిరంజీవితో పాటు పలువురు ముఖ్యతారాగణం ఈ షెడ్యూల్‌లో భాగమవుతున్నారని తెలిసింది. ఈ పోరాట ఘట్టాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని, చిరంజీవి మేకోవర్‌ అభిమానులను అలరిస్తుందని చిత్రబృందం చెబుతున్నది. పంచభూతాలు, ముల్లోకాల కాన్సెప్ట్స్‌ ప్రధానంగా ఫాంటసీ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

image

Leave Your Comments