అందరి టీవీ డిజిటల్ న్యూస్:వరంగల్: ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహార పదార్థాలు అందించడమే లక్ష్యంగా ఆహార భద్రతా శాఖ అధికారులు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని పలు ఆహార తయారీ యూనిట్లపై TG SAFE చర్యలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా కొన్ని యూనిట్ల లైసెన్సులను సస్పెండ్ చేయగా, మరికొన్ని సంస్థలకు షోకాజ్ నోటీసులు, ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు.
లైసెన్సులు సస్పెండ్ చేసిన యూనిట్లు:
వరంగల్ జిల్లాలోని దయానంద్ ఐస్‌క్రీమ్స్, రాజు ఘీ స్వీట్స్, హరిప్రియ గార్లిక్ పేస్ట్, రమేష్ ఇండస్ట్రీస్ (హరి సోంపు), శుభమ్ ఆయిల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (శ్రీకృష్ణ ఆయిల్స్), వెల్‌మార్క్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, బెల్ బ్రాండ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, శ్రీ కృప బేకరీ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్‌తో పాటు హన్మకొండలోని కపిల్ ఫుడ్స్ యూనిట్ల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు.
లైసెన్స్ సస్పెన్షన్‌కు సిఫార్సు:
వరంగల్‌కు చెందిన కరణి స్పైసెస్ యూనిట్ లైసెన్స్ సస్పెన్షన్‌కు అధికారులు సిఫార్సు చేశారు.
షోకాజ్ నోటీసులు జారీ:
కాజీపేటలోని మార్లూస్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్, స్వాగత్ స్వీట్స్, వరంగల్‌లోని వర్ష స్పైసెస్, హన్మకొండలోని మిఠాయి వాలా యూనిట్లకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఇంప్రూవ్‌మెంట్ నోటీసు:
వరంగల్‌కు చెందిన శివ తార ఫ్లోర్ మిల్ యూనిట్‌కు ఇంప్రూవ్‌మెంట్ నోటీసు జారీ చేశారు.
ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే యూనిట్లపై తనిఖీలు, చర్యలు కొనసాగనున్నాయి.