బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా మహిళలకు పండుగ కానుకలు అందించిన కౌన్సిలర్ రాయిడి కీర్తి దుష్యంత్ రెడ్డి.

Date: 2026-10-18
news-banner
అందరి టీవీ డిజిటల్ న్యూస్ నర్సంపేట: బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని నర్సంపేట మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ రాయిడి కీర్తి దుష్యంత్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డులోని మహిళలకు సొంత ఖర్చులతో చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పండుగల సందర్భంగా వార్డులో గడపగడపకు వెళ్లి మహిళలకు చీరలను అందజేస్తూ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగతో పాటు విజయానికి, ధర్మానికి ప్రతీకగా భావించే దసరా పండుగలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పండుగ వేళ మహిళలకు చీరలను కానుకగా అందించడం ద్వారా వారితో ఆత్మీయ అనుబంధాన్ని పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆడ పడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సంగతి గుర్తు చేస్తూ... ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కనీసం చీరలు కూడా అందించడం లేదని,,,, అందుకే తమ
సొంత ఖర్చులతో చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అని అన్నారు. చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం పట్ల స్థానిక మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. పండుగల సందర్భంగా తమను ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు చీరలను అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై పండుగల ఆనందాన్ని పంచుకోవడం అభినందనీయమని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ నాడెం స్వరూప నగేష్, సీనియర్ నాయకులు దండు రాజు, గోడిశాల గిరినాథ్, మొద్దు వేణు, కేసరి సురేందర్, నూనె మల్లయ్య, తోట రమేష్, కమలాకర చారి, కొలువుల ప్రవీణ్, ఈరెళ్లి రాజు, బండారి సంతోష్, నడెం కర్ణాకర్, పెరుగు లక్ష్మణ్, నడెం శ్రీనివాస్, పెరుమాండ్ల శంకర్, జగన్ నాయక్, గోడిశాల అనిల్, బత్తిని వంశీ, ఇప్ప గణేష్, మహేష్ పెరుమాండ్ల, శ్రీకుమార్ ముత్యం, బాచి తదితరులు పాల్గొన్నారు.
పండుగల వేళ ప్రజలతో కలిసి సంతోషాన్ని పంచుకుంటూ, మహిళలకు గౌరవ సూచకంగా చీరల పంపిణీ చేయడం ద్వారా 9వ వార్డులో బతుకమ్మ, దసరా పండుగల సందడి నెలకొంది.

Leave Your Comments