33 ఏళ్ల విద్యాసేవలకు ఘన సత్కారం.. ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఐ. రామకృష్ణకు పురస్కారం#AndariTVDigitalNews #TeacherDay2026 #GuruPujotsavam #BestHeadmaster #IRamakrishna

Date: 2026-09-06
news-banner
అందరి టీవీ డిజిటల్ న్యూస్ : విద్యారంగానికి 33 సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికై ఘన సత్కారం అందుకున్నారు.
సెప్టెంబర్ 5 గురుపూజోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి డాక్టర్ సత్య శారద ఐఏఎస్ గారి చేతుల మీదుగా శ్రీ ఐ. రామకృష్ణ గారు ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా సత్కారం పొందారు.
ఈ కార్యక్రమంలో డీఈవో శ్రీ బి. రంగయ్య నాయుడు గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ నాగరాజు గారు, ఎమ్మెల్సీ శ్రీ బసవరాజు సారయ్య గారు, కుడా చైర్‌పర్సన్ శ్రీమతి గుండు సుధారాణి గారు, జెడ్పీ సీఈవో శ్రీమతి వసంత గారుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
మూడు దశాబ్దాలకు పైగా విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేస్తూ, విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన శ్రీ ఐ. రామకృష్ణ గారికి ఈ అరుదైన గౌరవం లభించడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
విద్యార్థుల్లో క్రమశిక్షణ, విలువలు, నాణ్యమైన విద్యను పెంపొందించడంలో ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమని పలువురు కొనియాడారు.

Leave Your Comments