నర్సంపేటలో పెద్ది విగ్రహం ఏర్పాటు వివాదం.. పోలీసులతో వాగ్వాదం | ఐదుగురిపై కేసు నమోదు ... ఎవరిపైనా అంటే ..? | Breaking News#Narsampet #PeddiSudarshanReddy #Warangal #TelanganaNews #BreakingNews #PeddiSudarshanReddyStatue #NarsampetNews #PoliceCase #Telanga

Date: 2026-08-15
news-banner
అందరి టీవీ డిజిటల్ & జిల్లా ప్రతినిధి
వరంగల్, ఆగస్టు 15:

నర్సంపేటలో  మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు వివాదం.. ఉద్రిక్తత లో 
పోలీసులతో వాగ్వాదం.. ఐదుగురిపై కేసు నమోదు

వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదుట అనుమతులు లేకుండా విగ్రహం ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. విగ్రహం ఏర్పాటు విషయంలో పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించగా.. పోలీసులు అతడిని అడ్డుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

పోలీసులను నెట్టివేయడం, దుర్భాషలాడటం, విధులకు ఆటంకం కలిగించినట్లు వచ్చిన ఆరోపణలపై ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేసు నమోదు ఐ న వారి వివరాలు 
A1. శీలం వీరన్న, A2. నన్నపనేని నరేందర్, A3.
రాయిడి దుశ్యంత్, A4. సంగాని సూరయ్య, A5. దోణాల రవి
ఈ ఘటనపై నర్సంపేట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

“మీ ప్రాంతంలోని ప్రతి వార్తను.. నిజానిజాలతో మీ ముందుకు తీసుకువచ్చే మీ అందరి ఛానల్.. అందరి టీవీ.
తాజా వార్తల కోసం అందరి టీవీని ఫాలో అవ్వండి.
లైక్ చేయండి.. కామెంట్ చేయండి.. షేర్ చేయండి.. సబ్‌స్క్రైబ్ చేయండి.”

Leave Your Comments