మహానేత వైయస్సార్‌కు ఘన నివాళులు.#YSRDeathAnniversary #Narsampet #YSRFans #AndariTVDigitalNews

Date: 2026-09-02
news-banner
అందరి టివి డిజిటల్ న్యూస్: దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా నర్సంపేట పట్టణంలో ఘనంగా నివాళులర్పించారు. నర్సంపేటలోని వైయస్సార్ స్మారక గార్డెన్‌లో వైయస్సార్ అభిమానుల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు పండ్ల పంపిణీ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ నాడెం శాంతి కుమార్  మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో “ప్రజలే నా కుటుంబం” అనే భావనతో పనిచేసిన గొప్ప ప్రజానాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు.
పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం వైయస్సార్ అనేక చారిత్రాత్మక కార్యక్రమాలను అమలు చేశారని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం వంటి విప్లవాత్మక పథకాలు కోట్లాది మంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాయని పేర్కొన్నారు.
వైయస్సార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్లే ప్రజల గుండెల్లో ఆయన “మహానేత”గా చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ప్రజల ఆదరాభిమానాల్లో ఆయన ఎప్పటికీ సజీవంగా ఉంటారని నాడెం శాంతి కుమార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ అభిమానులు గిరగాని చంద్రమౌళి, జిల్లేపల్లి దినేష్, మాదాసి శోభ, ఖాజాబీ, నాడెం నాగేశ్వర్, రామకృష్ణ, శ్రీనివాస్, రాజు, యుగంధర్, రాజేందర్, కట్టయ్య, శివ, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave Your Comments