అందరి టీవీ డిజిటల్ న్యూస్ భద్రాచలం: ఓరుగల్లు ఉద్యమ నేత, నర్సంపేట మాజీ శాసనసభ్యులు, దివంగత నేత గౌరవ శ్రీ పెద్ది సుదర్శన్‌రెడ్డి గారి అస్థికలను భద్రాచలం క్షేత్రంలోని పవిత్ర గోదావరి నదిలో శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు.
ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి గారి సతీమణి పెద్ది స్వప్న, కుమారుడు పెద్ది నిదర్శన్‌రెడ్డి, కుమార్తె ధర్మిష్టతో పాటు కుటుంబ సభ్యులు, సకుటుంబ పరివారం పాల్గొన్నారు.
అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం గోదావరి నదిలో అస్థికలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులు పాల్గొని దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించారు.