అందరి టివి డిజిటల్ న్యూస్: హెల్త్ డెస్క్: కోడిగుడ్డు గురించి శాస్త్రం చెప్పేది ఇదే!
*ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ఈ వాదనపై సైన్స్ ఏం చెబుతోంది?*
*అసలు మనం రోజూ తినే కోడిగుడ్డులో ప్రాణం ఉంటుందా?!*
శాస్త్రీయంగా గుడ్లను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
*ఫెర్టిలైజ్డ్ గుడ్లు..*
కోడిపుంజుతో కోడిపెట్ట కలవడం వల్ల ఉత్పత్తి అయ్యే గుడ్లను ఫెర్టిలైజ్డ్ గుడ్లు అంటారు. వీటిలో జీవం ఉంటుంది, వీటి పొదిగితే కోడిపిల్లలు పుడతాయి. ఇవి మాంసాహారం కిందకే వస్తాయి.
*అన్-ఫెర్టిలైజ్డ్ గుడ్లు..* కోడిపుంజుతో కలవకుండానే, వయసు వచ్చిన కోడిపెట్ట సహజంగానే పెట్టే గుడ్లను అన్-ఫెర్టిలైజ్డ్ గుడ్లు అంటారు. మనం సూపర్ మార్కెట్లలో కొనే పౌల్ట్రీ గుడ్లన్నీ ఈ కోవకే చెందుతాయి.
*కోడిగుడ్డు శాకాహారమేనా?*
సైన్స్ ఏం చెబుతోంది? అంటే
మనం రోజూ తినే పౌల్ట్రీ గుడ్ల తయారీలో కోడిపుంజు పాత్ర ఉండదు కాబట్టి, ఆ గుడ్ల నుండి కోడిపిల్లలు పుట్టే అవకాశమే లేదు. అనగా, మనం తినే గుడ్లలో ఎలాంటి జీవం (ప్రాణం) ఉండదు. జంతువు లేదా పక్షిని చంపకుండా, కేవలం వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే పాలు లాంటిదే అన్-ఫెర్టిలైజ్డ్ గుడ్డు అని, కాబట్టి శాస్త్రీయంగా మార్కెట్ గుడ్లు ‘శాకాహారం’ కిందకే వస్తాయని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు.
ఎగ్ వైట్ (తెల్లసొన) పూర్తిగా వెజ్
గుడ్డులో మూడు భాగాలు ఉంటాయి. పైపొర , తెల్లసొన పచ్చసొన. ఇందులో తెల్లసొన పూర్తిగా నీరు మరియు ప్రోటీన్ల మిశ్రమం మాత్రమే. ఇందులో ఎలాంటి జంతు కణాలు ఉండవు. కాబట్టి ఎగ్ వైట్ అనేది వంద శాతం శాకాహారమే. పచ్చసొనలో కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు అధిక ప్రోటీన్లు ఉంటాయి. ఫెర్టిలైజ్డ్ గుడ్లలో అయితే పచ్చసొనలోని కణాల నుండే కోడిపిల్ల ప్రాణం పోసుకుంటుంది కాబట్టి దానిని నాన్-వెజ్ అనొచ్చు. కానీ, మనం తినే అన్-ఫెర్టిలైజ్డ్ గుడ్లలోని పచ్చసొనలో పిండం లేదా జీవం ఏర్పడటానికి అవసరమైన కణాలు అభివృద్ధి చెందవు. కాబట్టి, సైన్స్ ప్రకారం పౌల్ట్రీ గుడ్డు పచ్చసొన కూడా మాంసాహారం కిందకు రాదు. కోడి నుండి వచ్చినప్పటికీ, ప్రాణం లేని గుడ్లను (మార్కెట్లో దొరికేవి) తినడం వల్ల ఎవరి ప్రాణాన్ని తీయడం లేదు కాబట్టి వాటిని శాకాహారంగానే పరిగణించవచ్చు. *పశువుల నుండి వచ్చే పాలను ఎలాగైతే శాకాహారంగా స్వీకరిస్తున్నామో, కోడి నుండి వచ్చే అన్-ఫెర్టిలైజ్డ్ గుడ్డును కూడా నిరభ్యంతరంగా తినవచ్చని* పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.