అందరి టీవీ డిజిటల్ న్యూస్: నర్సంపేట నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు రాయిడి దుష్యంత్ రెడ్డి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ తన వంతు సహకారం అందించారు. ఎస్‌జీఎఫ్ (SGF) అండర్-19 బాలబాలికల రగ్బీ స్టేట్ సెలక్షన్ కమ్ టోర్నమెంట్‌లో వరంగల్ జిల్లా జట్టుకు స్పాన్సర్‌గా నిలిచి క్రీడలకు చేయూతనందించారు.
ఈ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచి, వచ్చే నెల ఢిల్లీలో జరగనున్న అండర్-19 జాతీయ స్థాయి రగ్బీ టోర్నమెంట్‌కు తెలంగాణ రాష్ట్రం తరఫున ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు.
జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులు:
🏅 కే. సోమనాథ్ – బాలుర విభాగం
జెడ్పీహెచ్‌ఎస్, అయోధ్యపురం, గూడూరు మండలం, మహబూబాబాద్ జిల్లా.
🏅 బి. రక్షిత – బాలికల విభాగం
మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాల, నర్సంపేట, వరంగల్ జిల్లా.
రగ్బీ క్రీడలో ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో జరగనున్న జాతీయ పోటీల్లోనూ సోమనాథ్, రక్షిత అద్భుత ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు.
యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ, ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. క్రీడాకారుల విజయానికి తన వంతు సహకారం అందించిన రాయిడి దుష్యంత్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నారు.