అందరి టీవీ డిజిటల్ న్యూస్ | వెబ్ డెస్క్
చూస్తేనే గుండె ఆగిపోయే దృశ్యం.. కళ్లముందు నిలువెత్తు మరణం! గుజరాత్‌లో ఉప్పొంగి ప్రవహిస్తున్న మాహి నది వంతెనపై ఓ భారీ లారీ ప్రమాదానికి గురైంది. వేగంగా వచ్చిన లారీ వంతెన రక్షణ రైలింగ్‌ను ఢీకొట్టడంతో దాని ముందు భాగం నది వైపు గాల్లో వేలాడుతూ ప్రమాదకర పరిస్థితి నెలకొంది.
లారీ క్యాబిన్‌లో ఉన్న డ్రైవర్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో కూర్చుండిపోయాడు. ఒక్క అంగుళం తేడా జరిగినా లారీ నదిలో పడిపోయే ప్రమాదం ఉండటంతో అక్కడి పరిస్థితి తీవ్ర ఉత్కంఠను రేపింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి, సాహసోపేతంగా డ్రైవర్‌ను క్యాబిన్ నుంచి సురక్షితంగా బయటకు తీశాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ ప్రాణాలతో బయటపడటాన్ని చూసిన వారంతా "ఆయుష్షు ఉంటే చావు నోటి దాకా వెళ్లినా తిరిగి రావచ్చు" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..
📺 ANDARI TV DIGITAL
ANDARI TV DIGITAL అనేది ANJALI MEDIA NETWORK PRIVATE LIMITED ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజా ప్రయోజనాల డిజిటల్ మీడియా వేదిక.
ఆధ్యాత్మికం, సంస్కృతి, తాజా వార్తలు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, సామాజిక అంశాలు, ప్రేరణాత్మక కథలు వంటి నాణ్యమైన కంటెంట్‌ను బాధ్యతాయుతంగా ప్రజలకు అందించడమే మా లక్ష్యం.
🌐 Website: www.anjalimediagroup.org
📞 Contact: 99591 43079 | 90590 13079 | 90597 38940
ANDARI TV DIGITAL
"ప్రజల కోసం... ప్రజలతో... ప్రజల గొంతుకగా..."