బ్రాహ్మణపల్లి గ్రామంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 20.898 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో గుజరాత్‌కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. గంజాయితో పాటు మూడు బ్యాగులు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.