అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తులు ,అమర్‌నాథ్ యాత్రకు భక్తుల .తాకిడి.! తొలి 11 రోజుల్లోనే 2.75 లక్షల మందికి పైగా దర్శనం

Date: 2026-07-15
news-banner
అమర్‌నాథ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. జులై 3న ప్రారంభమైన ఈ యాత్రకు రోజురోజుకూ స్పందన పెరుగుతోంది. తొలి 11 రోజుల్లో యాత్రికుల సంఖ్య 2.75 లక్షలు దాటింది. ప్రస్తుత రద్దీని బట్టి మూడు లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్లడం ఇదే తొలిసారి.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు, వైద్య సేవలు, తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు వంటి అన్ని సౌకర్యాలను అధికారులు కల్పించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య యాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది.

Leave Your Comments