ఓరుగల్లు రక్షకభట సారథిగా ఎన్. శ్వేతారెడ్డి.. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ#ANDHARITVDIGITAL #Warangal #WarangalCP #NSwethaReddy #TelanganaPolice #PoliceCommissioner #WarangalNews #LawAndOrder #DistrictNews

Date: 2026-07-01
news-banner

వరంగల్ | ANDHARI TV DIGITAL | జిల్లా ప్రతినిధి

చారిత్రక వరంగల్ నగరానికి కొత్త పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేతారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో ఇప్పటివరకు కమిషనర్‌గా విధులు నిర్వహించిన సన్‌ప్రీత్ సింగ్ నుంచి ఆమె అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన ఎన్. శ్వేతారెడ్డి కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

ప్రజలకు మరింత చేరువయ్యేలా పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పోలీసింగ్‌ను అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. సాధారణ ప్రజలకు భరోసా కల్పిస్తూ, నేర నియంత్రణ, మహిళల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారంలో సమర్థవంతమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేసి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తామని ఆమె స్పష్టం చేశారు.






Leave Your Comments