ఇందిరా గాంధీకి ఘన నివాళి
అందరి టీవీ డిజిటల్ న్యూస్ వరంగల్: భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా గురువారం కాశీబుగ్గలోని ఆమె విగ్రహానికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్‌పర్సన్, మాజీ రాజ్యసభ సభ్యురాలు, జీడబ్ల్యూఎంసీ మాజీ మేయర్ గుండు సుధారాణి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, డీసీసీ అధ్యక్షుడు మొహమ్మద్ అయూబ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుండు సుధారాణి మాట్లాడుతూ, ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరా గాంధీ జయంతి రోజున (నవంబర్ 19) ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని ప్రవేశపెడుతోందని తెలిపారు. ఈ పథకం ద్వారా కుటుంబ యజమాని లేదా యజమానురాలు మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా వర్తిస్తుందని చెప్పారు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ పథకాన్ని తీసుకువచ్చారని, అర్హులైన ప్రజలందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్, ప్రియాంక గాంధీ ఆల్ ఇండియా సంఘటన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు బిల్లా శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు గోరంట్ల రాజు, గుండు పూర్ణచందర్, పాలకుర్తి సుమన్ గౌడ్, మన్నె బాబురావు, మాడుగుల రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని తాజా వార్తలు, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ మరియు సైబర్ అలర్ట్స్ కోసం అందరి టీవీ డిజిటల్ న్యూస్ (Andari TV Digital News) ను సబ్‌స్క్రైబ్ మరియు ఫాలో చేయండి!కామిశెట్టి రంజిత్ కుమార్
ఉమ్మడి వరంగల్ జిల్లా కరస్పాండెంట్
సెల్: 9059738940