నర్సంపేటలో మోటార్ల దొంగల ముఠా అరెస్ట్ | 84 మోటార్లు స్వాధీనం | రూ.18.44 లక్షల సొత్తు రికవరీ#Narsampet #WarangalPolice #MotorTheft #PoliceArrest #TelanganaNews #WarangalNews #NarsampetNews #DCPAnkitKumar #FarmersNews #CrimeNews #AndariTV #AndariTVDigitalNe

Date: 2026-11-19
news-banner
వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ నీటి మోటార్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నర్సంపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు మరో నలుగురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.18.44 లక్షల విలువైన 84 విద్యుత్ మోటార్లతో పాటు దొంగతనాలకు ఉపయోగించిన నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
గురువారం ఉదయం నర్సంపేట సబ్ ఇన్‌స్పెక్టర్ రాజన్ బాబు తన సిబ్బందితో కలిసి రాజుపేట క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ట్రాలీ ఆటోతో పాటు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా వెళ్తున్న ఏడుగురు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.దొంగిలించిన మోటార్లను విక్రయించేందుకు రాజుపేట గ్రామ శివారులోని చెట్ల పొదల్లో దాచిపెట్టినట్లు నిందితులు తెలపడంతో పోలీసులు అక్కడ తనిఖీలు నిర్వహించి 84 విద్యుత్ మోటార్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన ప్రధాన నిందితులు:
హంస ప్రశాంత్ (27)
అన్న శివప్రసాద్ (22)
ఎస్.కె. దస్తగిరి అలియాస్ షైర్ (20)
వీరితో పాటు మరో నలుగురు బాలురను (CCL) అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు:
84 విద్యుత్ నీటి మోటార్లు – రూ.18,44,800 విలువ.
ఒక ట్రాలీ ఆటో.
ఒక ప్యాసింజర్ ఆటో.
ఒక పల్సర్ మోటార్ సైకిల్.
ఒక షైన్ మోటార్ సైకిల్.వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్ల భద్రతపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సూచించారు. గ్రామ శివారు ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించినా, మోటార్ల దొంగతనాలు జరిగినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు.
ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ఈస్ట్ జోన్ డీసీపీ నగదు రివార్డులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, నర్సంపేట ఇన్‌స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్, ఎస్ఐ రాజన్ బాబు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు హరికృష్ణ, రాఘవేందర్ రావు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave Your Comments

Trending News