ములుగు జిల్లా ప్రతినిధి / అందరి టీవీ డిజిటల్ వార్తలు ఏటూరు నాగారం
ములుగు జిల్లా లో
గతంలో ఫారెస్ట్ రేంజ్ అధికారిగా కన్నాయి గూడెం. ఏటూరు నాగారం ఇన్చార్జి రేంజ్ అధికారిగా పనిచేసిన బాలరాజు తునికాకు కూలీల బోనస్ డబ్బులు 2 లక్షల 70 వేల రూపాయలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు స్థానిక ఫారెస్ట్ అధికారులు ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి శనివారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ మాట్లాడుతూ రేంజ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న బాలరాజు అవుట్ సోర్సింగ్ వారి అకౌంట్లో నగదు బోనస్ డబ్బులు పడడంతో ఇట్టి డబ్బులు డ్రా చేయించుకొని తన స్వంతానికి వాడుకొని అక్రమాలకు పాడినట్లు నిర్ధారణ కావడంతో ఫారెస్ట్ రేంజి అధికారి ఫిర్యాదు మేరకు రేంజ్ అధికారి బాలరాజు ను అదుపులోకి తీసుకొని విచారించి కేసు నమోదు చేసి కోర్ట్ కు తరలించడం.
జరిగింది ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేలేదని వారు ఎంతటి వారైనా చర్యలు తప్పు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ అనుముల శ్రీనివాస్ ఎస్సై తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు
ads