అందరి టీవీ డిజిటల్ / హనుమకొండ ప్రతినిధి
76వ గణతంత్య్ర వేడుకల సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో అధ్యక్షులు వేముల నాగరాజు జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం అతిథులతో కలసి జాతీయ గీతాలాపన చేశారు.
ఈ సందర్భంగా వేముల నాగరాజు మాట్లాడుతూ క్లబ్ గౌరవ సభ్యులకు ఫిబ్రవరి మొదటి వారం నుండి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించనున్నామని ప్రకటించారు. క్లబ్ లో సభ్యత్వం లేని వారు ఏదైనా సమాచారం కోసం వస్తే అభ్యంతరం లేదని, కానీ పదే పదే వచ్చి క్లబ్ వాతావరణాన్ని చెడగొడితే ఊరుకోబోమని హెచ్చరించారు. అర్హత ఉన్న వర్కింగ్ జర్నలిస్టులైన క్లబ్ సభ్యుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ పూర్వ బాధ్యులు, వివిధ యూనియన్ల నేతలు
పీవీ మదన్ మోహన్, పిన్నా శివకుమార్, గడ్డం కేశవమూర్తి, గడ్డం రాజిరెడ్డి, శ్రీ రాం రాంచందర్, మసకపురి సుధాకర్, తోట సుధాకర్, అర్షం రాజ్ కుమార్, తడక రాజ్ నారాయణ, కంకణాల సంతోష్, మ్యాడం రజినీకుమార్, బూరం ప్రశాంత్, తాల్లపల్లి వేణు, ప్రెస్ క్లబ్ కోశాధికారి బోల్ల అమర్, ఉపాధ్యక్షులు గోకారపు శ్యాం, బొడిగె శ్రీనివాస్, కొడిపెల్లి దుర్గాప్రసాదరావు, అల్లం రాజేష్ వర్మ, యంసాని శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ వలిశెట్టి సుధాకర్, పొడిచెట్టి విష్ణువర్ధన్, ఈసీ మెంబర్లు వీరగోని హరీష్, దొమ్మటి శ్రీకాంత్, ఎండీ నయీం, ఆంజనేయులు@అంజి, సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.
అధ్యక్షులు వేముల నాగరాజు పుట్టినరోజు సందర్భంగా క్లబ్ హాలో లో జర్నలిస్టుల మధ్య కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2025 సంవత్సర క్యాలండర్ ను ఆవిష్కరించారు.