మేడారం మినీ జాతరపై అధికారులతో మంత్రుల సమీక్ష / AndariTv Digital / Mulugu District News / Medaram Mini Jathara

Date: 2025-01-25
news-banner
అందరి టీవీ డిజిటల్ న్యూస్ / ములుగు జిల్లా ప్రతినిధి 
మేడారం మినీ జాతరపై క్షేత్రస్థాయిలో జిల్లా అధికారులతో మేడారం పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు 
సమస్యలపై భక్తులు వచ్చే రద్దీ గురించి రోడ్లు నీరు మరుగుదొడ్లు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ శాఖ నుంచి ఫారెస్ట్ అధికారులు హెల్త్ డిపార్ట్మెంట్ కరెంటు రెవెన్యూ హెల్త్ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ తమతమ అధికారులతో మేడారం మినీ జాతరపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు 
దేవాదాయ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మినీ జాతరను కూడా సక్సెస్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం కాబట్టి భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని విధాల అధికారులు పనులు చేయాలని ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామని వారు  అన్నారు 
సీతక్క మాట్లాడుతూ పెద్ద జాతర వలె ఈ జాతర కూడా 50 లక్షల మంది భక్తులు వస్తారని ఆలోచనతో ఉన్నామని వచ్చే భక్తులకు ఎలాంటి సమస్య లేకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు
ఇంకా ఎంపీ బలరాం నాయక్ తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు 
image

Leave Your Comments