అందరి టీవీ డిజిటల్ / గ్రేటర్ వరంగల్ ప్రతినిధి
అభివృద్ధి పనులు 'మౌలిక సదుపాయాలు కల్పించడంలో కొందరు అధికారుల పనితీరు నిర్లక్ష్యం వలన ప్రజల నుండి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని 40 వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు
పారిశుద్ధ పనులలో కార్మికులు ఉన్న వాహనములు సరిపడాలు లేవని చెత్తా ట్రాక్టర్ లేక 20 రోజులు గడుస్తుందని రెండు స్వచ్ఛ ఆటోలు ఖరాబై ఐదు నెలలు గడుస్తున్న అట్టి స్థానంలో నూతన వాహనములు సమకూర్చలేదని కచ్చా కాలువలు పోర్చుకపోయి రోడ్డుపై నీరు ప్రవహిస్తున్నందున ప్రజలు నడవలేక పోతున్నారని జెసిబి అవసరమని సియం హెచ్ ఓ ఎం హెచ్ ఓ సూపర్వైజర్ శానిటరీ ఇన్స్పెక్టర్లకు చెప్పి పది రోజులు కావస్తున్న డివిజన్ కు పంపడం లేదు వాహనాలను సమకూర్చడం లేదు డివిజన్లో ఆరు నెలల నుండి స్తంభాలకు కొన్ని లైట్లు వెలగడం లేదని నూతనంగా స్తంభాలకు లైట్లు ఏర్పాటు చేయాలనిఎన్నో మార్లు చెప్పిన రిపేర్లు లేవు కొత్తవి లేవు లైట్లు ఎప్పుడు వెలుగుతాయో ఎప్పుడు బంద్ అవుతుందో అంతుపట్టని విషయం చెట్లోళ్లగడ్డ వద్ద పైప్లైన్ లీకేజీ వేల లీటర్లు నీరు వృధా అవుతుందని సంబంధిత అధికారులకు తెలియపరిచిన ఇంతవరకు లీకేజీలు అరికట్టలేదు దీనివల్ల కాలువ నుండి ఇండ్లలోకి నీరు వస్తుంది ఏ ఒక్క అధికారి కనీసం డివిజన్లో పర్యటించిన పాపాన పోలేదు డివిజన్లో దాదాపు 16 కల్వర్టులు మూసుకుపోయి కరాబ్ అయినందున మురుగునీరు బయటకు వెళ్లడం లేదని మేయర్ గుండు సుధారాణి గారు డివిజన్ కు విచ్చేసినప్పుడు స్వయంగా చూసిన ఇంతవరకు అట్టి పనులు కావడం లేదు ప్రస్తుత కమిషనర్ గారికి అనేక పర్యాయములు వినతిపత్రం లు ఇచ్చిన ఏ ఒక్క దాని పై స్పందించ లేదు 3 సంవత్సరాలనుండి కాలులకు మార్కింగ్ ఇవ్వమని టౌన్ ప్లాన్ అధికారులకు తెలియపరిచిన ఇంతవరకు మార్కింగ్ ఇవ్వడం లేదు దీనివలన స్మశాన వాటిక మునిగిపోతున్నవి ఈ విధంగా ఉంటే డివిజన్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నిస్తున్నాను పాలన విధానం ఏ విధంగా నడుస్తుందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అధికారుల విధానం లు మారకుంటే త్వరలోనే ప్రజల మద్దతు కార్యాచరణ ప్రకటిస్తానని తెలియపరుస్తున్నాను అని
40 వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి తెలిపారు
.