కోట చెరువును పరిశీలించిన సిపి, కలెక్టర్

Date: 2024-09-13
news-banner
అందరి టీవీ /వరంగల్ ప్రతినిధి 

ఈనెల 16వ తేదీన ట్రై సిటీ పరిధిలో నిర్వహించే గణేష్ నిమర్జన కార్యక్రమానికి సంబంధించి వరంగల్ నగరంలో గణేష్  ప్రతిమలు నిమర్జనము చేసే చెరువుల్లో ఒకటైన కోట చెరువును వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద,మున్సిపల్ కమిషనర్ అశ్వనీ తానాజీ వకాడే, సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, వరంగల్, ట్రాఫిక్ ఏసీపీలు నందిరాం నాయక్, సత్యనారాయణతో పాటు నీటి పారుదల, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, విద్యుత్తు,స్థానిక పోలీస్ అధికారులతో నిమర్జన చెరువు ను పరిశీలించారు. నిమర్జన కార్యక్రమ నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై క్షేత్ర స్థాయిలో సిపి, కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షా చేశారు. ముఖ్యంగా నిమజ్జన జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన క్రెన్లు,సిబ్బంది నియామకం, విద్యుత్తు ఏర్పాట్లు, బారికేడ్ల నిర్మాణం,  తెప్పల ఏర్పాటు పై సిపి, కలెక్టర్ అధికారులతో చర్చించారు.



https://anjaliott.com/anjali-ott-app-download/




image

Leave Your Comments