ప్రజలనుప్రైవేట్ హాస్పటల్స్ పై చర్యలు తీసుకోవాలి - ఆర్ఎంపీ, పిఏంపి ల వ్యవస్థను రద్దు చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం అందచేత

Date: 2024-09-09
news-banner

అందరి టీవీ డిజిటల్ న్యూస్ / హనుమకొండ జిల్లా ప్రతినిధి  
హనుమకొండ: వైద్యం పేరుతో ప్రజలను దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు హాస్పిటల్కు వత్తాసు పలికే విధంగా పేషంట్లను పంపుతూ కమిషన్లు తీసుకుంటున్న ఆర్.ఎం.పి, పి ఏం పిల వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి డి. తిరుపతి, సహాయ కార్యదర్శి ఓ. చిరంజీవి, కమిటీ సభ్యులు మాటూరు సతీష్ , హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్యకు వినతి పత్రం అందజేశారు. 

ప్రైవేటు హాస్పటల్లో ఇష్టానుసారంగా ఓపి ఫీజులను పెంచుకుంటూ, సాయంత్రం అదనంగా రెట్టింపు స్థాయి ఓ పి వసూలు చేస్తూ,అవసరం లేకున్నా టెస్టులు, స్కానింగ్ లు రాస్తూ, హాస్పటల్ ఆవరణంలోనే సొంతగా మెడికల్ షాపులు నిర్వహిస్తూ, ఆపరేషన్, అడ్మిషన్ల, అడ్వాన్సు ల పేరుతో వేలాది రూపాయలు దోచుకుంటున్నారు. మెడికల్ ఎస్టాబ్లేషన్ యాక్ట్  నిబంధనలను పాటించడం లేదు. నివాస  భవనాలల్లో కనీస నిబంధనలు లేని బిల్డింగ్ ల లో హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పనిచేసే ఆర్ఎంపీ, పి.ఎం.పి వైద్యులు ప్రభుత్వాన్ని బంధనలు విస్మరిస్తూ ప్రైవేటు హాస్పటల్లో చేసే దోపిడికి వత్తాసు పలికే విధంగా గ్రామాల్లో నుంచి వచ్చే రోగులను ప్రైవేటు హాస్పటల్లకు రెఫర్ చేస్తూ టెస్టులు, స్కానింగ్ లో కమిషన్లు తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంజక్షన్లు, గ్లూకోస్ బాటిల్స్ పెడుతూ, యాంటీబయటిక్  మందులు ఇస్తున్నారు. వైద్యం పేరుతో దోచుకుంటున్నారు. ప్రైవేటు హాస్పిటల్లో దోపిడిని అరికట్టి, ఆర్ఎంపీ, పిఏంపి ల వ్యవస్థను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు




image

Leave Your Comments