భువనగిరి పట్టణం లో టీజీఎంసీ / తెలంగాణ వైద్య మండలి బృందం తనిఖీలు

Date: 2024-09-08
news-banner

అందరి టీవీ డిజిటల్ / డెస్క్ ప్రత్యేకం 
👉మారూటే సెపరేట్ అంటున్న భువనగిరి కి చెందిన కొందరు క్వాలిఫైడ్ వైద్యులు 

👉క్వాలిఫైడ్ వైద్యుల అనైతిక చర్యలకు కేరాఫ్ గా మారిన భువనగిరి 

👉 తనిఖీ లలో విస్తుపోయే నిజాలు,  అవాక్కయినా తనిఖీ బృందం

👉కాసుల కోసం కక్కుర్తి పడి Rmp / pmp లకు సర్టిఫికెట్స్ ఇచ్చి నకిలీ వైద్య వ్యవస్థని ప్రోత్సహిస్తున్న  క్వాలిఫై్డ్ వైద్యులు 

👉క్వాలిఫైడ్ డాక్టర్ల పేరు మీద అనుమతి తీసుకొని RMP / PMP /నకిలీ వైద్యులే ప్రాక్టీసు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న విషయాలను వెలుగు లోకి తెచ్చిన టీజీఎంసీ అధికారులు.

👉క్వాలిఫైడ్ వైద్యుల పై చర్యలకు రంగం సిద్ధం 

👉క్వాలిఫైడ్ వైద్యుల అనైతిక చర్యలపై 
చైర్మన్ డా మహేష్ కుమార్ ఆగ్రహం
👉 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు క్వాలిఫైడ్ వైద్యులను సస్పెండ్  చేసే యోచన దిశగా ఎతికల్ కమిటీ చైర్మన్ డా కిరణ్ కుమార్ 

👉అడుగడుగునా క్లినికల్ ఎష్టబ్లిషమెంట్  యాక్ట్ కు తూట్లు - గతంలో జిల్లా వైద్య అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికి మారని నకిలీ వైద్యుల తీరు 

👉క్వాలిఫైడ్ వైద్యుల అనైతిక చర్యలను సహించేది లేదు,  పర్యవసానాలు తప్పవంటున్న పబ్లిక్ రిలేషన్ కమిటి చైర్మన్ డా వి.నరేష్ కుమార్

తెలంగాణా వైద్య మండలి చైర్మన్ డా మహేష్ కుమార్,. రిజిస్ట్రార్ డా లాలయ్య కుమార్ ల భువనగిరి లోని నకిలీ వైద్యులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు టీజీఎంసీ సభ్యులు డా వి.నరేష్ కుమార్ డా కె. విష్ణు నేతృత్వం లోని వైద్య బృందం భువనగిరి లోని RMP/ Pmp /నకిలీ వైద్యులు చికిత్సలు అందిస్తున్న సెంటర్స్ పైన తనిఖీలు నిర్వగంహించారు.






గత కొంత కాలంగా  RMP / PMP /నకిలీ వైద్యుల సెంటర్ పై తనిఖీ లు చేస్తున్న టీజీఎంసీ అధికారులు భువనగిరిలోని కొందరూ వైద్యుల తీరుతో అవాక్కయారు నారు,  క్వాలిఫైడ్ వైద్యుల పై  ప్రభుత్వ అనుమతి తీస్కొని నకిలీ వైద్యులతో ఆ సెంటర్ లలో RMP / Pmp / నకిలీ వైద్యులతో వైద్యం అందిస్తున్నారు. 

భువనగిరి లోని వెంకటేశ్వరా x ray క్లినిక్ లో నకిలీ వైద్యుడు  రాంచందర్ యదేచ్చగా స్టేరాయిడ్,  ఆంటిబయోటిక్ ఇంజెక్షన్స్ పేషెంట్స్ కి ఎటువంటి   అవసరం లేకున్నా ఇస్తున్నట్లు గుర్తించారు మరియు  సదరు నకిలీ వైద్యుడు డా సుజాత పేరు తో వెంకటేశ్వరా హాస్పిటల్ పేరు మీద డిస్ట్రిక్ రిజిస్ట్రేషన్ అథారిటీ లో అనుమతి తీస్కొని తానే డాక్టరు వాక చికిత్సలు నిర్వహిస్తుండడం గమనార్హం
అలాగే మహేశ్వర హాస్పిటల్ లో బి.  బాలయ్య అనే నకిలీ వైద్యుడు  10వ తరగతి వరకే చదివి 
ఇదే తరహాలో  అనైతికంగా వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు, డా విజయ్ కుమార్ పేరు తో అనుమతి తీస్కొని బాలయ్య నే డాక్టరు గా చికిత్స లు అందిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

మరియు HB కాలనీ లోని క్యూరెవెల్ చిల్డ్రన్స్ క్లినిక్ లో ఎటువంటి పిల్లల డాక్టర్ లేకుండా బషీరుద్దిన్ అనే BAMS వైద్యుడు పిల్లలకు అల్లోపతి చికిత్సలు అందిస్తున్నట్టు మరియు ఈ సెంటర్ డా రెహ్మాన్ అన్సారీ పేరు మీద అనుమతి తీస్కొని అతను లేకుండానే Bams వైద్యుడు బషీరుద్దిన్ చికిత్సలు నిర్వహిస్తునట్టు గుర్తించారు.




నకిలీ వైద్యులు రాంచందర్, బి. బాలయ్య పైన NMC చట్టం 34,54 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్టు  అలాగే   వీరి సెంటర్ కి జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ అనుమతి కి సర్టిఫికెట్స్ ఇచ్చి నకిలీ వైద్యులను ప్రోత్సహిస్తున్న  డా సుజాత,   జనగామ లో ENT అసోసియేట్ డా విజయ్ కుమార్,   
మరియు డా రెహ్మాన్ అన్సారీ లకు  టీజీఎంసీ నోటీసు ఇవ్వనున్నారు.

Bams వైద్య విద్య అభ్యసించి చిల్డ్రన్ క్లినిక్ నిర్వ్వహిస్తూ  పిల్లలకు అల్లోపతి వైద్యం ఇస్తున్న డా బషీరుద్దిన్ పైన ఆయుర్వేదిక్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయనున్నారు.




అనైతికంగా నకిలీ వైద్యులు చికిత్స చేయడానికి సహకరిస్తున్న క్వాలిఫైడ్ వైద్యులపై చైర్మన్ డా మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎతికల్ కమిటీ చైర్మన్ డా టి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ టీజీఎంసీ రిజిస్ట్రే్రేడ్ వైద్యులు ఎవరైనా సరే నకిలీ వైద్యులను ప్రోత్సహిస్తూ వారి సెంటర్ నిర్వహినకు సర్టిఫికెట్ ఇచ్చిన వైద్యులపై  తప్పకుండ చర్యలు తీస్కుంటామని  6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.




గవర్నమెంట్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తూ నకిలీ వైద్యులు చికిత్స చేయడానికి సర్టిఫికెట్ ఇచ్చిన డా విజయ్ కుమార్ పైన డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా వాణి కి ఫిర్యాదు చేయనున్నట్టు,  నకిలీ వైద్యుల సెంటర్స్ కి అనుమతి కి సర్టిఫికెట్స్ ఇచ్చిన  క్వాలిఫైడ్ వైద్యుల పై చర్యలు తప్పవని,  ఇప్పటికి అయినా వారి తీరు మార్చుకోవాలని పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా నరేష్ కుమార్ తెలియ చేశారు.

తనిఖీలలో టీజీఎంసీ కో ఆప్ట్ మెంబెర్స్ డా రాజీవ్,  డా అరుంధతి,  వరంగల్ ఆంటీ క్వాకరీ అసోసియేట్ సభ్యులు డా నవీన్ పాల్గొన్నారు




image

Leave Your Comments