అందరి టీవీ డిజిటల్ వార్తలు / మహబూబాద్ జిల్లా ప్రతినిధి
మహబూబాబాద్ జిల్లాలో తీవ్రవర్షాలు కురుస్తున్న సందర్భంలో జిల్లా పోలీసుయంత్రాంగం అందించిన సేవలు ప్రశంసనీయం అంటూ అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సీతరాంతండలో సీరోలు ఎస్ఐ నరేష్ అందించిన సేవలను ప్రత్యేకంగా అభినందించడంతోపాటు, రాళ్ళవాగులో డిసియంతో సహా కొట్టుకపోయిన నలుగురిని కాపాడడంతోపాటు, ఆకస్మాత్తుగా రైళ్ళు ఆగిపోవడంతో అష్టకష్టాలు పడిన వేలాదిమందికి అన్నపానీయలు అందించడంలో ప్రత్యేక చొరవ చూపిన మహబూబాబాద్ టౌన్ సిఐ దేవేందర్, రూరల్ సిఐ సర్వయ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించారు.
జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ ను ప్రత్యేకంగా ప్రశంసించిన సియం, భవిష్యత్ లోనూ ఇదే పనితీరును జిల్లాపోలీస్ యంత్రాంగం కొనసాగించాలని పిలుపునిచ్చారు