వరంగల్ కాశిబుగ్గ లో నకిలీ వైద్యుల సెంటర్ లపై టీజీఎంసీ సోదాలు , 100ల సంఖ్యలో స్టేరాయిడ్ ఇంజెక్షన్స్ స్వాదీనం.

Date: 2024-09-02
news-banner

అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రతినిధి 
ప్రముఖ మెడికల్ ఏజెన్సీ నుండి ఫార్మసీ అనుమతి లేకుండానే  నకిలీ వైద్యులకి లక్షల రూపాయల మందుల సరఫరా.

స్టేరాయిడ్స్ కి ప్రజలను అలవాటు / బానిసలుగా చేసి దీర్ఘకాలిక  వ్యాధులు సగం వయసు దాటాకుండానే వస్తున్న వైనం 

టీజీఎంసీ చైర్మన్ డా మహేష్ కుమార్ ఆదేశాల మేరకి కాశిబుగ్గ ప్రాంతంలో నకిలీ వైద్యులపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా డా నరేష్ కుమార్ నేతృత్వం లోని వరంగల్ ఆంటీ క్వాకరీ బృందం డా వెంకట స్వామి, డా ప్రసన్న లతో కూడిన బృందం కాశిబుగ్గ లోని సుహాన ఫస్ట్ ఎయిడ్ సెంటర్,  హిజమా మెడికల్ సెంటర్ , రామ్మోంహన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ల పై తనిఖీ లు నిర్వహించారు.



ఈ సెంటర్స్ అన్ని కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహింప బడే  డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ వంటి ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్టు టీజీఎంసీ అధికారులు గుర్తించారు.
సుహన ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వహిస్తున్న 
నకిలీ వైద్యుడు  గుర్రం సదానందం గతంలో నగరం లో ప్రముఖ హాస్పిటల్ ఐసీయూ లో అటెండర్ గా పని చేసి వైద్యుడి అవతారం ఎత్తి  ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మాటున  MBBS వైద్యుని రీతిలో  చికిత్సలు చేస్తున్నాడని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు నిర్వహించిన అధికారులకు సదరు నకిలీ వైద్యుడి వద్ద వందల సంఖ్యలో స్టెరోయిడ్స్,  నొప్పి నివారణ ఇంజెక్షన్స్,  ఆంటిబయోటిక్ ఇంజక్షన్ గుర్తించి ఆశ్చర్య పోయారు.
మరియు ఈ షెడ్యూల్ మందులు అన్ని కూడా పిన్నా వారి స్ట్రీట్ లోని మెడికల్ ఏజెన్సీ నుండి ఎటువంటి ఫార్మసీ అనుమతి లేకుండా వేరే షాప్ లైసెన్స్ ద్వారా అంగట్లో కూరగాయల వలె తెచ్చుకుంటున్నట్లు తనిఖీ బృందం గుర్తించింది.

సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నకిలీ వైద్యుడు సదానందం,  తిలక్ రోడ్ నకిలీ వైద్యుడు రామ్మోహన్,  హిజమా మెడికల్ సెంటర్ లో  ఎక్స్ రే టెక్నీషియన్ చదివి డాక్టరు గా చేలామని అవుతున్న నకిలీ వైద్యుడు షేక్ నయీమ్ లపై NMC చట్టం 34,54 ప్రకారం ఇంతేజర్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నారు 



మరియు ఎక్స్ రే టెక్నీషియన్ చదివి ఎటువంటి అనుమతి లేకుండా ఆలోపతి వైద్యం చేస్తున్న షేక్ నయీమ్ పారా మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలనీ పారా మెడికల్ బోర్డు కు సిఫార్సు చేయనున్నట్లు  టీజీఎంసీ తనిఖీ బృందం తెలియ చేసింది.
టీజీఎంసీ లో రిజిస్ట్రేషన్ లేకుండా  వైద్యుల వలె చెలామణి అవుతూ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ పేరు మీద పరిధి దాటి ఇబ్బడి ముబ్బడిగా ఆంటిబయోటిక్, స్టెరోయిడ్స్ ఇస్తూ పేద ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న  ప్రతి నకిలీ వైద్యుడి పైన చర్యలు తప్పవని  HRDA వరంగల్ ప్రెసిడెంట్ డా వెంకట స్వామి తెలియ చేశారు.




ప్రస్తుత జ్వరాల తీవ్రత దృష్ట్యా ప్రజలు కూడా నకిలీ వైద్యుల వద్దకి వెళ్లి మోసపోవద్దని వారు ఎటువంటి శాస్త్రీయత లేకుండా  ఇష్టమోచ్చిన  స్టేరోయిడ్స్,  ఆంటిబయోటిక్ ఇంజక్షన్  ఇవ్వడం వలన తొలి దశ లోనే గుర్తించాల్సిన విష జ్వరాలు సంక్లీష్ట  దశలోకి వెళ్లి  తర్వాత పెద్ద హాస్పిటల్ కి వెళ్లడం వలన ప్రాణ నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుందని అలాగే ఆర్ధికంగా ఎంతో ఇబ్బంది పడే అవకాశం ఉందని కావున ప్రజలు దగ్గర లోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా టీజీఎంసీ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న  క్వాలిఫైడ్ వైద్యుల పర్యవేక్షణ లో నాణ్యమైన వైద్యం పొంది ఎంతో విలువైన ఆరోగ్యం కాపాడుకోవాలని డా నరేష్ కుమార్ సూచించారు.

విష జ్వరాలు సోకి నకిలీ వైద్యుల వద్ద  తొలి దశలో వైద్యం తీస్కోవడం వలన అవి ముదిరి పోయి  కొన్ని విష జ్వరాల మరణాలు సంభవించాయని  తెలంగాణ వైద్య మండలి / టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా నరేష్ కుమార్ తెలియ చేశారు 










image

Leave Your Comments