పేదల కాలనీలలో మురికి నీరు వరద నీరును తొలగించి మౌలిక సదుపాయాలు కల్పించాలి..... ఎం సి పి ఐ (యు ) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ.

Date: 2024-08-31
news-banner

అందరి టీవీ డిజిటల్ ,నర్సంపేట /వరంగల్ జిల్లా 
 గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల, పేదల కాలనీలోని కారల్ మార్క్స్ కాలనీ ఇండ్లలోకి  వరద నీరు మురికి నీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంసీపీఐ(యు )రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ పేదల కాలనీలను సందర్శించి, అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.



    ఈ సందర్భంగా వంగల రాగసుధ మాట్లాడుతూ, గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పట్టణ ప్రగతి పేరుతో, పట్టణంలోని వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్న పేరుతో సైడ్ కాల్వల నిర్మాణం చేపట్టకుండా, వల్లబ్ నగర్, మల్లంపల్లి రోడ్డు  నుంచి వచ్చే వరద నీటినంతటిని కూడా  పేదల కారల్ మార్క్స్ కాలనీ వైపుమళ్ళించడం జరిగిందని, అలా
మళ్ళిస్తే కాలనీకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని  నగర పంచాయతీ అధికారులను అడ్డుకోవడం జరిగిందని, పైప్ లైన్లు వేసి పైపులైన్ల ద్వారా మురికి నీటిని వరద నీటిని అంతటినీ కూడా పెద్ద కాల్వవైపు మల్లి ఇస్తామని చెప్పేసి నగర పంచాయతీ అధికారులు  హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నదని, వర్షం పడితే చాలు పేదల కాలనీలలోని ఇండ్లలోకి చెరువులను తలపించే విధంగా నీరు చేరుతుందని, ఇంటి నుంచి బయటకు రాకుండా నిత్యావసరాలు కూడా తీసుకొచ్చుకోలేని పరిస్థితిలో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు నర్సంపేట పట్టణంలో కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వర్షపు నీరు మొత్తం రోడ్ల పైన ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొన్నదని, పలు వార్డులలో ఎక్కడి నీరు అక్కడే నిలిచి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఇది నగర పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. పేదల కాలనీలలో పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా మిషన్ భగీరథనల్లలను వేయడం జరిగిందని, ఇప్పటివరకు ఆ నల్ల కలెక్షన్లు ఇవ్వలేదని, మురికి నీరు, దోమలు,పందుల వల్ల అక్కడున్న ప్రజలు డెంగ్యూ మలేరియా జ్వరాల బారిన పడుతున్నారని, ఇప్పటివరకు కాలనీలలో దోమల నివారణకు దోమల మందు పిచికారి చేయలేదని, వార్డులలో మల్లి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంటున్న పాలకులకు గాని,నగర పంచాయతీ అధికారులకు గానీ పేదల కాలనీలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు





. ఇప్పటికైనా మున్సిపాలిటీ కమిషనర్ గారు పేదల కాలనీలను సందర్శించి వరద నీరును మురికి నీటిని పైప్ లైన్ ల ద్వారా  దారి మళ్లించి శాశ్వత పరిష్కారం చూపెట్టాలని, పేద ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, నర్సంపేట పట్టణంలో సైడ్ కాల్వల నిర్మాణం చేయాలని, బ్లీచింగ్ ఫాగింగ్ లాంటి కార్యక్రమాలు చేపట్టాలని, లేనిపక్షంలో  ఎం సి పి ఐ( యు ) పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం సి పి ఐ యు డివిజన్ కమిటీ సభ్యురాలు జన్ను జమున, పార్టీ సభ్యులుసిరిపెల్లి సంపూర్ణ,గణిపాక బిందు,ఈసం పెళ్లి కోమల, బాదావత్ లక్ష్మి, జన్ను విమల, కాకి కోమల, తదితరులు పాల్గొన్నారు












image

Leave Your Comments