కలకత్తాలో జూనియర్ డాక్టర్ ను అత్యాచారం చేసి దారుణంగా చంపిన దుర్మార్గులను ఉరితీయాలి ; ఏ ఐ ఎఫ్ డి డబ్ల్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగల రాగసుధ

Date: 2024-08-28
news-banner


స్వాతంత్ర భారతంలో మహిళలకు రక్షణ కల్పించకపోవడం సిగ్గుచేటు



అందరి టీవీ డిజిటల్ / నర్సంపేట / వరంగల్ జిల్లా ప్రతినిధి 
  ప్రజలపై భారాలు వేయాలనుకునే ప్రభుత్వాలకు బషీర్ బాగ్ విద్యుత్ పోరాటం ఒక గుణపాఠం అని ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని ఏ పాలక ప్రభుత్వం మనుగడ సాధించదని ఇది చరిత్ర చెప్పిన సత్యం అని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ అన్నారు.
    ఈరోజు బషీర్ బాగ్ విద్యుత్ పోరాట అమరవీరులు విష్ణువర్ధన్ బాలస్వామి రామకృష్ణల 24వ వర్ధంతి సందర్భంగా ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి మౌనం పాటించి నినాదాలు చేస్తూ ఘనంగా నివాళి అర్పించారు.



   ఈ సందర్భంగా వంగల రాగసుధ మాట్లాడుతూ ఆనాడు నరాంతక చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై ఎనలేని విద్యుత్ చార్జీలను పెంచితే మోయలేని భారాలను భరించలేక ప్రజలు తిరగబడి నెలల తరబడి పోరాడి చలో అసెంబ్లీకి తరలిన లక్షలాదిమంది ప్రజలపై విచక్షణారహితంగా భాష్పవాయువులు లాఠీలు తూటాలు ప్రయోగించి ప్రజాస్వామికంగా కాల్పులు జరిపి విష్ణువర్ధన్ బాలస్వామి రామకృష్ణలను బలిగొన్నారని ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం ఘోరంగా ఓటమిపాలై తగిన శాస్తి జరిగిందని ఆ తర్వాత వచ్చిన పాలకులు విద్యుత్ ఛార్జీలు పెంచాలంటేనే జంకినారని ఆ పోరాటం ఎంత స్ఫూర్తిదాయకంగా గెలిచిందని ఆ పోరాట స్ఫూర్తితో ప్రస్తుతం ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలుకై ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పాలకులు బషీర్బాగ్ ఉద్యమాన్ని గుణపాఠంగా తీసుకొని ప్రజలపై భారాలు వేయకుండా ప్రజా అనుకూల విధానాలు రూపొందించి అమలు చేయాలని లేకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
    ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ నాయకులు కుక్కల యాకయ్య, గడ్డం స్వరూప, సతీష్,అచల, అనూష, నిర్మల, పుష్ప, నీలా, దేవమ్మ,జబీన్, రాజు,బండారి లావణ్య,లక్ష్మి, ప్రమీల, సుశీల,కొమురమ్మ, రజిత, సరిత,తదితరులు పాల్గొన్నారు








image

Leave Your Comments