చెన్నారావుపేట సిద్ధార్థ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు..

Date: 2024-08-26
news-banner
అందరి టీవీ డిజిటల్ / చెన్నారావుపేట / వరంగల్ జిల్లా 
వరంగల్ జిల్లా చెన్నారావుపేట 
మండల కేంద్రంలోని సిద్ధార్థ గురుకుల హైస్కూల్లో సోమవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు 
ఈ సందర్భంగా సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్  కంది గోపాల్ రెడ్డి ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పిల్లలు చాలా చక్కగా వేషధారణలతో అలరించారని ,పిల్లలకు చదువుతో పాటు సంస్కృతి ,సంప్రదాయాలను మరియు పండుగల గొప్పదనాన్ని తెలియచేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు 



 ఈ వేడుకలలో  విద్యార్థులు శ్రీకృష్ణుని గోపికల అవతారంలో ప్రత్యేక ఆకర్షగా నిలిచారు. 
అలాగే పలు సంస్కృతిక కార్యక్రమాలు  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం అండెం  కరుణాకర్ రెడ్డి. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు








image

Leave Your Comments