నర్సంపేట విజ్ డమ్ ప్రీ స్కూల్ లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Date: 2024-08-26
news-banner

అందరి టీవీ డిజిటల్ / నర్సంపేట / వరంగల్ జిల్లా ప్రతినిధి 
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం లోని  విజ్ డమ్ ప్రీ స్కూల్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.
 పాఠశాల కరస్పాండెంట్ జహంగీర్,  డైరెక్టర్ జావేద్, ప్రిన్సిపాల్ ఫహీం సుల్తానా గార్లు కార్యక్రమాన్ని ప్రారంభించగా 
చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపిక వేషాధారణలో  అలరించారు. 


120 మంది విద్యార్థులు వేషాధారణలో నృత్యం చేస్తూ పలువురిని ఆకర్షించడం జరిగింది. చిన్నారులు అందంగా అలంకరించుకొని పాఠశాలకు వచ్చి తమ తమ ప్రావీణ్యతను చాటుకున్నారు. 
ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు పాల్గొని తమ ఆనందోత్సాలను వెలిబుచ్చారు.
 కృష్ణుడి గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ తమ ప్రతిభను చాటారు. 
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జావేద్ గారు మాట్లాడుతూ మన భారతదేశం అన్ని మతాలకు స్వర్గం లాంటిదని, భారత దేశంలో నివసించే ప్రజలంతా కుల మతాల కతీతంగా అన్నదమ్ముల వలె కలసి మెలసి ఉండాలని, విద్యార్థులంతా బాల్య దశ నుండే దేశభక్తిని అలవర్చుకోవాలని, తద్వారా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని మొదటి స్థానంలో నిలపగలుగుతామని, మన అందరిదీ ఒకే జాతి, అది భరత జాతి అని తెలిపారు.



 ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఫహిమ్ సుల్తానా, అకాడమిక్ ఇంచార్జి హారిక, ఉపాధ్యాయులు భద్రయ్య, శ్రీలత, దివ్య, సరితారాణి, మాధవి, రాధిక, అఖిల, స్వాతి, సౌజన్య, అనిత, రజనీ కుమారి, వినీల, అస్రా, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు








image

Leave Your Comments