అందరి టీవీ డిజిటల్ నల్లగొండ
*నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో దారుణం*
దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంతో నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళిన గర్భిణి.
అక్కడ బెడ్ ఇవ్వకపోవడంతో కుర్చీలోనే ప్రసవించిన గర్భిణి.
నేరేడుగోమ్మ మండలానికి చెందిన అశ్వినీ పురిటి నొప్పులతో నిన్న అర్ధరాత్రి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ వైద్యులు లేకపోవడంతో, నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది.
వెంటనే బెడ్ కల్పించకుండా సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో, తెల్లవారుజాము వరకు కూర్చున్న అశ్విని అలానే కుర్చీలోనే ప్రసవించింది.
రక్తస్రావం చూసి అప్పుడు పరుగులు పెట్టి, హాడావిడి చేసిన వైద్యులు, వైద్య సిబ్బందిపై గర్భిణి కుటుంబసభ్యులు మండిపడ్డారు.