అందరి టీవీ డిజిటల్ / ఖమ్మం జిల్లా
రాఖీ పౌర్ణమి పండుగ వేళ ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ ఘాతంతో భార్యాభర్తలు మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం బస్వాపురం లో చోటుచేసుకుంది.. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్వా పురానికి చెందిన బాణోత్ సెమినా (36), దండెం పై బట్టలు ఆరవేస్తుండగా, అలాగే నిశ్చెష్టురాలై ఉండిపోయింది. అది గమనించిన భర్త బాణోత్ శ్రీను(40), ఆమెకు హృదయ సంబంధమైన వ్యాధి ఉండడంతో, అందువల్లే అలా ఉండిపోయిందేమో అనుకొని, మంచం పైకి తీసుకు వద్దామని ఆమెను పట్టుకున్నాడు. అయితే వారు కట్టుకున్న దండెం ఇనుపరాడ్డుకు గాలికి వూగి తెగిన వైర్లు అంటుకొని, విద్యుత్తు ప్రవహించడంతో, విద్యుత్ షాక్ తో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన దంపతులకు ప్రియాంక అనే కూతురు ఉంది. కాగా రాఖీ పౌర్ణమి వేళ భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడంతో, బస్వాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి