తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ నాయకులు....

Date: 2024-08-17
news-banner

అందరి టీవీ డిజిటల్ / ములుగు జిల్లా ప్రతినిధి 
ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షులు చిటమట రఘు గారి ఆధ్వర్యంలో  మీడియా  సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 
ఈ  కార్యక్రమానికి జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్ గారు ముఖ్యఅతిధులుగా హాజరైనారు.
ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు గారు మాట్లాడుతూ...ఆర్టిసి బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్ లు, రికార్డింగ్ డాన్స్ లు చేసుకోవచ్చు అని కేటీఆర్ అత్యంత జుగుప్సకరంగా మాట్లాడారు.మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్,మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా,ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు.మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. భేషరతుగా కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేశారు.ఆడవాళ్ళను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనడం మీ బుర్రలో వున్న బురదకు నిదర్శనం.గత పది సంవత్సరాలు హైదరాబాద్లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు  ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది,మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నాము. అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నాం.శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృధా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి,ఇంటి వద్ద చేసుకునే చిన్నా చితక పనులు బస్సుల్లో చేసుకుంటే... వారిని బ్రేక్ డాన్స్ లు వేసుకోమనడం దుర్మార్గం. మహిళలు బ్రేక్ డాన్స్ లు చేసుకోండి అనే మాటలు నీ నోటికి ఎలా వచ్చాయి కేటీఆర్..కేటీఆర్ మాట్లాడిన మాటలు అత్యంత అసభ్యకరంగా ఉన్నాయి.మహిళలు పట్ల అసభ్యకర మాటలు మాట్లాడిన కేటీఆర్ తీరును ఖండిస్తున్న,తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ చేసుకొండి అనే ధైర్యం ఎలా వచ్చింది కేటీఆర్,తెలంగాణ మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, బీఆర్ఎస్ క్రమాపణ చెప్పాలి.ప్రజలకు ఉపయోగపడే పథకాలు మీకు నచ్చవు,ఉచిత బస్సు ప్రయాణ ఆలోచన మీకు రాలేదు..పదేండ్లు మీరు చేయలేదు,మేము చేస్తే దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఆర్టీసీలో ప్రయాణాలు చేసేవాళ్లు తప్పుడు పనులు చేస్తున్నారన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గుమ్మడికాయ దొంగలు అంటే కేటీఆర్ భుజాలు తడుముకోవడం ఎందుకు కేటీఆర్ తక్షణ మహిళలకు బహిరంగక్షమాపణ చెప్పాలి డిమాండ్ చేశారు.


ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్,జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ఖలీల్ ఖాన్, జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింహారావు,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య,జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి కొండగొర్ల పోషయ్య,మండల ఉపాధ్యక్షులు ఎండీ రియాజ్,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ పాషా,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొప్పుల శ్రీనివాస్,మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కర్నె సత్యం,మండల సహాయ కార్యదర్శి ముమ్మానేని రమేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు కుక్కల రాములు,టౌన్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ల తరుణ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, వికాస్ తదితరులు పాల్గొన్నారు




image

Leave Your Comments