నర్సంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా మూడో సారి పాలాయి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం

Date: 2024-08-12
news-banner
 
అందరి టీవీ డిజిటల్ ,నర్సంపేట ప్రతినిధి 
వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సీనియర్ కాంగ్రెస్ నేత పాలాయి శ్రీనివాస్ నూతన కమిటీ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు

 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనపై నమ్మకంతో మరో మారు చైర్మన్ గా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ 
జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు వ్యవసాయ శాఖా మంత్రుల తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు జిల్లా ,డివిజన్ పార్టీ నేతలకు ,కార్యకర్తలకు అందరికి ధన్యవాదములు తెలిపారు 
ఈ కార్యక్రమంలో పి సి సి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ,పెండెం రామానంద్  ,డివిజన్ నేతలు ,కార్యకర్తలు ,పట్టణ ప్రముఖులు ,వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు 





విధేయతకు పట్టం  ...
ఎమ్మెల్యే దొంతికి ప్రధాన అనుచరుడు గా సీనియర్ కాంగ్రెస్ నేత గా  అందరికి అందుబాటులో ఉండే వ్యక్తిగా మంచి పేరు ఉన్న నేతగా పాలాయి కి పెట్టింది పేరు 
అలాంటి నేతకు మరో మారు చైర్మన్ గా అవకాశం ఇవ్వడం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యం గా రైతు బిడ్డ పదవి చేపట్టడం పై 
మార్కెట్ కు రైతులకు మంచి రోజులు వచ్చాయని రైతులు ఆనందపడుతున్నారు 



image

Leave Your Comments