అందరి టివి డిజిటల్ న్యూస్: నర్సంపేట మున్సిపాలిటీ 6వ వార్డు పరిధిలో ఈరోజు తేదీ 25-11-2026న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
మహబూబాద్ రోడ్డులోని సర్వాపురం గల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పొన్నం నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ పొన్నం నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కుటుంబ పెద్దకు ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్యంతో మరణించినా ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఈ బీమా పథకాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు.
ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు జీవిత బీమా వర్తిస్తుందని వివరించారు. 6వ వార్డులోని అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకంలో పేరు నమోదు చేసుకోవాలని, ఎవరూ మిస్ కాకూడదని పిలుపునిచ్చారు.
అంతేకాకుండా వార్డులోని ప్రతి ఇంటికి ఈ పథకం వివరాలు చేరేలా చర్యలు తీసుకుంటామని, నమోదు ప్రక్రియలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే తమను సంప్రదించాలని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం ముందు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఇకపై కూడా వార్డు అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పథకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. చాలా మంది అక్కడికక్కడే తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపించారు.
ఈ బీమా పథకం వల్ల సామాన్య కుటుంబాలకు ఎంతో భరోసా లభిస్తుందని, కష్టకాలంలో కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.