అందరి టీవీ డిజిటల్)
స్టేషన్ ఘన్‌పూర్‌లో విషాదం: ట్రాక్టర్ బోల్తా పడి రైతు దుర్మరణం
జనగామ జిల్లా / స్టేషన్ ఘన్‌పూర్ (అందరి టీవీ డిజిటల్ న్యూస్):
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం విశ్వనాథపూర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోజూవారీగా పొలం పనులకు వెళ్లిన ఓ రైతు, పనులు ముగించుకుని ట్రాక్టర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.
పొలం గట్టు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న బురద పొలంలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ కింద పడి సదరు రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో విశ్వనాథపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.