రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిన జాతీయ ప్రధాన రహదారిపై గుంతలు పూడ్చి వేయించిన ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్

Date: 2024-08-09
news-banner


అందరి టీవీ డిజిటల్ / ములుగు జిల్లా ప్రతినిధి 
ములుగు జిల్లా 
ఏటూరు నాగారం 163 వ జాతీయ ప్రధాన రహదారి చిన్న బోయినపల్లి తాడ్వాయి మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది.
రోడ్డుపై గుంతలలో వర్షపు నీరు నిలవడంతో  తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
గురువారం ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఐపిఎస్ . ఏటూరు నాగారం ఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ . ఆదేశాల మేరకు. సీఐ అనుముల శ్రీనివాస్ సూచనల మేరకు. గత రెండు రోజుల క్రితం చిన్న బోయినపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశంలో
ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చి వేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాదారులు అజాగ్రత్తగా వాహనాలు డ్రైవింగ్ చేస్తూ. మద్యం సేవించి అతివేగంగా ప్రమాదకరంగా వాహనాలు నడుపుతూ. రోడ్లపై ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలలో వర్షం నీరు నిలిచి ముందస్తుగా గుంతలను డ్రైవర్లు గమనించకుండా ప్రయాణించడంతో. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని. ట్రాఫిక్ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు.
రోడ్డు ప్రమాదాల సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి ప్రజలు కూడా ఇప్పుడు మరింత అజాగ్రత్తగా మారారు. చాలామంది ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు. అన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు భౌతిక నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా కలుగుతుంది. మీరు ఏ రకమైన రవాణా వ్యవస్థకు చెందిన వారైనా, ప్రజలు రోడ్డుపై వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలినీ. అన్నారు .



డ్రైవర్ లు మద్యం మత్తులో ఉన్నట్లు  ఐతే  డ్రైవర్ ల ను అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు 
 జీవితాలు ఎంత విలువైనవో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు చూసి. అర్దం చేసుకోవాలి అన్నారు. మనమందరం రోడ్డు మీద, కాలినడకన లేదా పట్టింపు లేని కారులో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు 
రోడ్డు ప్రమాదాల నివారణ
మరణాల రేటు తగ్గాలంటే రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి. రోడ్డు ప్రమాదాల్లో ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పిల్లలకు ట్రాఫిక్ నిబంధనల గురించి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. జీవితం యొక్క విలువను మరియు దానిని ఎలా కాపాడుకోవాలో వారికి నేర్పించాలి. అన్నారు 
అంతేగాక, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తుల కోసం ప్రభుత్వం మరింత కఠినమైన చట్టాలను ఆమోదించాలి. లింగంతో సంబంధం లేకుండా ఈ చట్టాలను ఉల్లంఘించినట్లు తేలినప్పుడు అట్టి వ్యక్తులకు భారీగా జరిమానా విధించి లేదా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
అదేవిధంగా, డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్‌లను ఉపయోగించకుండా తల్లిదండ్రులు చిన్నవారికి ఆదర్శంగా ఉండాలి. అలాగే ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు హెల్మెట్‌లు, సీటు బెల్టులు తప్పనిసరిగా ధరించాలి.
హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం, అతివేగంగా నడపడం వల్లే ప్రమాదాలు
హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం, అతివేగంగా నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని. అన్నారు 
 వాహనదారులు, పాదచారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని  తెలిపారు. 
వాహనాల సంఖ్యతో పాటు పెరుగుతున్న జనాభా కారణంగా ప్రాణనష్టం జరుగుతోంది అన్నారు 






image

Leave Your Comments