నర్సంపేటలో 26వ మండల పూజా మహోత్సవాలు ప్రారంభం | అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజలు#AyyappaSwamy #MandalaPooja #Narsampet #Warangal #AyyappaDeeksha #AndariTV #TelanganaNews #SwamiyeSaranamAyyappa

Date: 2026-11-15
news-banner
నర్సంపేటలో 26వ మండల పూజా మహోత్సవాలకు సర్వం సిద్ధం....
అందరి టీవీ డిజిటల్ న్యూస్ నర్సంపేట: శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో ఈ నెల 16-11-2026, సోమవారం నుంచి 26వ మండల పూజా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఈ సందర్భంగా మహోత్సవాల నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ట్రస్ట్ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.
మండల పూజా మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి భక్తులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ట్రస్ట్ చైర్మన్ సింగిరికొండ మాధవ శంకర్, అధ్యక్షులు సైఫా సురేష్, కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి, కోశాధికారి దొడ్డ రవీందర్, పాలకవర్గ సభ్యులు వెల్లడించారు.

Leave Your Comments