వరంగల్ కరీమాబాద్‌లో దొంగ స్వాముల బీభత్సం.. పట్టీలు మెరుగు పెడతామంటూ మహిళలకు మాయమాటలు!#Warangal #Karimabad #CrimeNews #GoldTheft #FakeSwamijis #MillsColonyPolice #CCSPolice #TelanganaNews #AndariTV #BreakingNews

Date: 2026-11-13
news-banner

అందరి టీవీ డిజిటల్

వరంగల్ జిల్లా ప్రతినిధి:వరంగల్: పట్టీలకు మెరుగు పెడతామంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు మహిళలను మోసం చేసి బంగారు ఆభరణాలతో పరారైన ఘటన వరంగల్ నగరంలోని కరీమాబాద్‌లో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. ఇద్దరు వ్యక్తులు స్వాముల వేషధారణలో కరీమాబాద్ ప్రాంతంలోని ఓ ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఉన్న మహిళలను పరిచయం చేసుకుని, వారి కాళ్లకు ఉన్న పట్టీలకు మెరుగు పెడతామని నమ్మించారు. ఈ క్రమంలో బాధితులు నీలం రత్నావతి (36), నీలం శిల్పారాణి (ఇంటర్ విద్యార్థిని)లకు నీళ్ల రూపంలో ఉన్న ఓ ద్రవాన్ని తాగించినట్లు సమాచారం.

అనంతరం మహిళల కాళ్లకు ఉన్న బంగారు పట్టీలు, మట్టెలను తీసుకుని ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. సుమారు 10 తులాల బంగారు పట్టీలు, 3 తులాల మట్టెలు అపహరణకు గురైనట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరోవైపు సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఫింగర్ ప్రింట్ నిపుణులు కూడా ఆధారాలు సేకరిస్తున్నారు.

పట్టీలకు మెరుగు పెడతామంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను ఇంట్లోకి అనుమతించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.                                                                                                                                                                                                                                      ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, జిల్లా స్థాయి విశేషాల కోసం చూస్తూనే ఉండండి.

అందరి టీవీ డిజిటల్ – ప్రజల గొంతుక.. ప్రజల కోసం!

Leave Your Comments