అందరి టీవీ డిజిటల్ & సినీ ప్రతినిధి
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించిన గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. 1973లో 'జగమే మాయ' చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు.
ప్రారంభంలో హీరోగా నటించిన ఆయన అనంతరం విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 600కు పైగా చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించారు. 'సింహ గర్జన', 'మెరుపు దాడి', 'ఇంద్రజిత్' వంటి చిత్రాల నిర్మాణంతో పాటు దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు.
తనదైన నటనా శైలితో తరతరాల ప్రేక్షకులను అలరించిన గిరిబాబు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు.
ఆయన మృతికి అందరి టీవీ డిజిటల్ ఘన నివాళులు అర్పిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది.
ఓం శాంతి!