అందరి టీవీ డిజిటల్ న్యూస్:విజయవాడ (కృష్ణలంక):
విజయవాడ నగరంలో మహిళ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపింది. కృష్ణలంక బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ లాడ్జిలో మహిళ మృతదేహం బయటపడటం సంచలనంగా మారింది. మృతురాలిని పైడిశెట్టి ఎర్రమ్మగా పోలీసులు గుర్తించారు.🔹 వివరాల్లోకి వెళితే..
ఎర్రమ్మ రెండు రోజులుగా కనిపించకపోవడంతో ఆమె భర్త సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కృష్ణలంకలోని ఓ లాడ్జిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఎర్రమ్మ ఓ యువకుడితో కలిసి లాడ్జికి వచ్చినట్లు తేలింది. సదరు యువకుడే ఆమెను దారుణంగా హత్య చేసి, గది తలుపులకు బయట నుంచి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.
🔹 పోలీసుల దర్యాప్తు..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లాడ్జిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. లాడ్జిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ.. ఎర్రమ్మతో వచ్చిన యువకుడు ఎవరు? అసలు ఆమెను ఎందుకు హత్య చేశాడు? అన్న కోణాల్లో ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం ఫాలో అవ్వండి 👉 అందరి టీవీ డిజిటల్ న్యూస్...