నర్సంపేట పరిధిలో 1,188 నూతన చేయూత పింఛన్ల పంపిణీ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద#AndariTV #AndariTVDigitalNews #Narsampet #DonthiMadhavaReddy #SathyaSharada #CheyuthaPensions

Date: 2026-11-14
news-banner
వరంగల్ జిల్లా (నర్సంపేట):
నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్‌లో నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. నర్సంపేట టౌన్ మరియు రూరల్ మండలాలకు సంబంధించి కొత్తగా మంజూరైన 1,188 మంది లబ్ధిదారులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద చేతుల మీదుగా పింఛన్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave Your Comments