నర్సంపేట లో నకిలీ వైద్యులపై కేసు నమోదు

Date: 2024-08-07
news-banner


అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా 

నర్సంపేట లోని నకిలీ వైద్యులు జయందర్ రెడ్డి,  శ్యామ్ ప్రసాద్ లపై తెలంగాణ వైద్య మండలి రిజిస్ట్రార్ డా లాలయ్య కుమార్ ఆదేశాల మేరకు NMC చట్టం 34,54, TSMP 22 ప్రకారం కేసు ఫైల్ చేయడం జరిగింది.

గత నెలలో వైద్య మండలి అధికారులు  పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా నరేష్ కుమార్ నేతృత్వంలోని ఆంటీ క్వాకరీ బృందం చేసిన తనిఖీలలో  సదరు నకిలీ వైద్యులు ఎటువంటి శాస్త్రీయత లేకుండా  విచ్చవిడిగా ఆంటిబయోటిక్స్,  స్టెరోయిడ్స్ ఇస్తున్నట్లు గుర్తించారు.

ప్రజలు కూడా ఈ నకిలీ వైద్యుల వద్దకు వెళ్లి మోసపోవద్దని,  వీరు ఇష్టా రీతినా ఇచ్చే ఆంటిబయోటిక్, స్టెరోయిడ్స్,  పెయిన్ కిల్లర్స్ వలన ధీర్ఘ కాలంలో చాలా దూష్పరిణామలు  ఉంటాయాని డా శేషు మాధవ్ తెలియ చేసారు.

అర్హత కి మించి,  వచ్చే రాని వైద్యం చేసే ప్రతి నకిలీ / RMP / పీఎంపీ ల పైన చర్యలు తప్పవని టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా నరేష్ కుమార్ హెచ్చరించారు




image

Leave Your Comments