నలుగురు ఆర్ ఎంపీ లపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

Date: 2024-08-04
news-banner
అందరి టీవీ డిజిటల్ / హనుమకొండ జిల్లా 

 మడికొండ పోలీస్  స్టేషన్ లో తెలంగాణ వైద్య మండలి అధికారుల ఫిర్యాదు మేరకు నలుగురు నకిలీ వైద్యులపై NMC చట్టం 34,54 మరియు TSMP చట్టం 22 ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది.


కడిపికొండ ప్రాంతం లో వైద్యులం అని చెప్పుకుంటూ ఫరిది ధాటి వైద్యం చేస్తున్న నకిలీ వైద్యులు ప్రభాకర్,  శ్రీహరి , అశోక్ కుమార్,. శ్రీనివాస్  లు RMP, PMP అని బోర్డులు పెట్టుకొని ఇలాంటి శాస్త్రీయత లేకుండా వారి ఇష్టనుసారం స్టెరోయిడ్స్,  ఆంటీ బయోటిక్స్ మరియు ఇతర మందులను ఇస్తున్నట్లు గతం నెలలో జరిగిన తనిఖీల లో అధికారులు గుర్తించి వీరిపై కేసులు నమోదు నమోదు చేసారు.



నకిలీ వైద్యులు RMP / PMP అని బోర్డులు పెట్టుకుంటూ  వారి వద్దకు వచ్చే అమాయక ప్రజలను  ఆసరాగా చేసుకొని ఎంతో నమ్మబలికి  వారికి ఎటువంటి శాస్త్రీయత,  కొలబద్ధత లేకుండా ఇష్ట రీతినా  మందులు నకిలీ వైద్యులు వినియోగిస్తున్నారని దీని వలన తొలి దశలోనే గుర్తించాల్సిన జబ్బులు మరింత ముదిరి పోయి ప్రజలకు మరింత ఆర్ధిక,  ప్రాణ నష్టం వాటిల్లు తుందని,  నకిలీ వైద్యుల వద్దకి ప్రజలు వెళ్లి నష్ట పోవద్దని తెలంగాణా వైద్య మండలి పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా వి నరేష్ కుమార్,. సభ్యులు డా శేషు మాధవ్ తెలియచేసారు




image

Leave Your Comments