హన్మకొండలోని వైబ్రాంట్ జూనియర్ కళాశాల హాస్టల్ లో విద్యార్థిని మృతి

Date: 2024-08-01
news-banner

అందరి టీవీ డిజిటల్ ,హనుమకొండ ప్రతినిధి 
హనుమకొండ జిల్లా కేంద్రంలోని నక్కలగుట్టలో గల వైబ్రాంట్ జూనియర్ కళాశాల హాస్టల్ లో 
ములుగు జిల్లా కమలాపూర్ కు చెందిన ఎనుమాముల భవాని అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఉరివేసుకుని మరణించినట్లు చెపుతూన్నారు 
తమ కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు 
పొంతన లేని సమాధానాలు చెప్తుండడం తో అనేక అనుమానాలు కల్గుతుండగా 
రాత్రి  ఘటన జరిగితే ఇప్పటి వరకు యాజమాన్యం అందుబాటులోకి రాకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు కళాశాలల లోని పూల కుండీలు ,ఫర్నిచర్ ద్వంసం చేశారు 
విద్యార్థి ఆరోగ్యం బాగలేకుంటే కనీస సమాచారం ఇవ్వరా అంటూ కళాశాల యాజమాన్యంపై  తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు 
కళాశాల చుట్టూ భారీగా మోహరించి   పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు 


image

Leave Your Comments